సీనియర్ నేత సబితా ఇంద్ర రెడ్డి మరోసారి మంత్రి అయి రికార్డు సాధించారు. సబితా ఇంద్రారెడ్డి భర్త ఇంద్రా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తరవాత రాజకీయాలలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2004 లో వైఎస్సార్ క్యాబినెట్లో ఆమె మొదటి సారి మంత్రి అయ్యారు. 2009లో మరోసారి ఆమె గెలిచిన తరవాత హోమ్ మినిస్టర్ అయ్యి దేశంలోనే మొదట మహిళా హోమ్ మినిస్టర్ గా రికార్డు సాధించారు.

ఇక వైఎస్సార్ అనూహ్య మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రభుత్వంలో కూడా మంత్రి గా పని చేశారు. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గా గెలిచిన సబితా.. ఆ పార్టీ ఓటమి చెందడంతో తెరాస లోకి మొగ్గు చూపారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయ్యి నలుగురు సీఎం ల వద్ద మంత్రి అయిన ఘనతను సొంతం చేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •