క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. లారస్ స్పోర్టింగ్ మూమెంట్‌ 2000-2020 అవార్డును సచిన్ గెలుచుకున్నారు. గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్స్ కు ఈ అవార్డు అందించడం కోసం పోటీ నిర్వహించారు. దీనిలో భాగంలో ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలో ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఇక ఈ పోటీలో 19 మంది పోటీ పడగా సచిన్ విజేతగా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజయం తరువాత సచిన్ ను సహచర ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంత తిరిగారు. క్యారీడ్ ఆన్ ద షోల్డ‌ర్స్ ఆఫ్ నేష‌న్ అనే కాప్షన్ తో ఈ ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఈ మూమెంట్ కే ప్రస్తుతం అవార్డు దక్కింది.

2017 లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ అనే పురస్కరాన్ని లారెస్ ప్రారంభించింది. బెర్లిన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక లారస్ స్పోర్టింగ్ మూమెంట్‌ 2000-2020 అవార్డు సచిన్ గెలుచుకోవడం యావత్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

sachin tendulkar

  •  
  •  
  •  
  •  
  •  
  •