తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లుగా మహిళ నాయకురాలు సాధినేని యామిని చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ బాబు పై ఎవరైనా ఆరోపణలు చేస్తే బలంగా తిప్పికొట్టడంలో ముందు వరుసలో ఉండేది. గత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత కూడా టీడీపీకి చెందిన నాయకులంతా సైలెంట్ అయితే వైసీపీ శ్రేణులు వచ్చేది తమ ప్రభుత్వమే అని అంటుంటే అప్పుడు కూడా యామిని తన వాయిస్ వినిపిస్తూ వైసీపీ సభ్యులను తూర్పార పట్టేది.

అలాంటి యామిని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సైలెంట్ అవ్వడమే కాకుండా అసలు ఆమె పాలిటిక్స్ లో ఉన్నారా లేరా అన్నట్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీనితో ఆమె బీజేపీలో చేరుతుందని గతంలో అనేక ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు ఆమెకు సర్ది చెప్పి త్వరలో మంచి రోజులు వస్తాయని పార్టీ మారవద్దని చెప్పుకొచ్చారు. కానీ రోజురోజుకి వైసీపీ బలపడుతూ తెలుగుదేశం నేతలంతా బీజేపీ, వైసీపీలలో చేరుతుండటంతో ముందుగానే బీజేపీలో చేరితే తనకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారట.

దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మంతనాలు చేసారని ఈనెల 10వ తేదీన బీజేపీలో చేరిక లాంఛనమని చెబుతున్నారు. బీజేపీ పార్టీలో ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళ నాయకురాలుగా బలంగా వాయిస్ వినిపించే సాధినేని యామిని పార్టీ మారడంతో బలమైన మహిళ నాయకురాలి వాయిస్
తెలుగుదేశం పార్టీకి కరువైందని చెప్పుకోవచ్చు.