టాలీవుడ్ సినిమాలకు ఈమధ్య వైవిధ్యభరితమైన టైటిల్స్ పెడుతూ దర్శక, నిర్మాతలు తమ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నా టైటిల్ లో విషయముంటే ప్రేక్షకులలోకి అతి సులువుగా వెళ్ళిపోతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక వైవిధ్యభరితమైన టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. జయంత్ అనే కొత్త దర్శకుడుని లాంచ్ చేస్తూ “ఆహ్వానించు వారు చీటీల చిట్టి” అనే పేరుతో ఈ టైల్ ను రిజిస్టర్ చేయించారట.

ఈ సినిమాకు నిర్మతగా భోగవల్లి ప్రసాద్, దిల్ రాజు ఇద్దరు కలసి ఉంటారట. అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈమధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ ప్రతి చిత్రం వరుస పెట్టి ప్లాప్ బాట పట్టడంతో ఇలా అవుట్ అండ్ అవుట్ కామెడీని నమ్ముకున్నట్లు తెలుస్తుంది. అతడిలో కామెడీ యాంగిల్ కూడా ఉండటంతో ఆ రూట్ లో ఇప్పుడు ట్రై చేస్తున్నట్లు ఉన్నాడు. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త సమయముందని తెలుస్తుంది. ఈ చీటీల చిట్టిగాడి ఆహ్వానం అందుకోవడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేస్తూ చిట్టిగాడి సరసన హెరాయిన్ గట్రా లాంటివన్నీ రివీల్ చేస్తారట.