కొంతమంది హీరోలు ఏదో ఆరాటంతో, ఆర్భాటంతో తాము మిమల్ని ఆదుకుంటామని హామీని ఇచ్చి ఆ తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీడియా స్టంట్ కోసం కొంతమంది ఇచ్చే హామీలు తరువాత బుట్టదాఖలు కావడంతో హామీ పొందిన వారు నిరుత్సాహానికి గురవుతుంటారు. కానీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఒక హామీని నిలబెట్టుకోవడంతో ఇప్పుడు అతడు అందరు మన్ననలు పొందుతూ నిజమైన హీరోగా కొలవబడుతున్నాడు.

విజయవాడలో అవ్వలు, తాతల కోసం “అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్” ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తుంది. కాని సరైన ఆదరణ లేక వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాను ఆదుకుంటానని గతంలో ముందుకు వచ్చాడు. అతడు చెప్పిన విధంగా ఇప్పుడు వారికి తన సొంత ఖర్చులతో రెండు అంతస్థుల బిల్డింగ్ ను నిర్మించాడు. సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో ఇప్పుడు అమ్మ ఫౌండేషన్ తో పాటు చాలా మంది అతడిని హీరోగా కొలుస్తున్నారు.