సాయి పల్లవి ప్రధాన పాత్రలో మళయాలంలో నటించిన సినిమా ‘అథిరన్’.ఈ సినిమాను తెలుగులో ‘అనుకోని అతిధి’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. సైకలాజికల్ ద్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ అయ్యింది. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో అన్నపు రెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ తెలియచేస్తారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య-శేఖర్ కమ్ముల మూవీ, రానా హీరోగా నటిస్తున్న ‘విరాట పర్వం’ మూవీలో నటిస్తుంది.