నాగచైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఈనెల 31 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. అనుకోని రీతిలో కేరళలో వరదలు సంభవించడంతో సినిమా రీ రీకార్డింగ్ లో జాప్యం జరగటంతో ఈ సినిమాను సెప్టెంబర్ 7న విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఆరోజు మరో నాలుగు సినిమాలు కర్చీఫ్ వేసి ఉండటంతో నిర్మాతలు అన్ని సినిమాల మధ్యలో విడుదల చేయడానికి తటపటాయిస్తున్నారు.

మరో వారం వెనక్కు వెళ్లి సెప్టెంబర్ 13 వినాయకచవితి రోజు బరిలో దిగాలన్న ఆలోచన కూడా ఉంది. అదే రోజు నాగ చైతన్య భార్య సమంత నటించిన యుటర్న్ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక భార్య భర్తల పోరు ఒకే రోజు అంటే అభిమానులలో కొంత ఆసక్తి ఉంటుంది. ఒకే రోజు ఇద్దరి సినిమాలు విడుదలైతే కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే ఆలోచనలో కూడా చిత్ర యూనిట్ ఉంది. ఎప్పుడో ఫిక్స్ చేసుకున్న సినిమా డేట్ పోస్ట్ పోన్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఎన్ని కష్టాలకు గురవుతుందో చూస్తూనే ఉన్నాం.