‘సైరా’ వంటి భారీ సినిమా తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మించే సినిమాపై ఆసక్తికరంగా ఉంది. గతంలో సురేందర్ రెడ్డి.. ప్రభాస్, అల్లు అర్జున్ తో సినిమాలు చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఆయన అక్కినేని అఖిల్ తో సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందే సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటున్నారు. ఇప్పటికే పూర్తి స్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన చేయనున్నారట. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •