నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలు మరింత ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమాలతో పాటు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల నుంచి వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని వార్తలు వస్తున్నా ఒక్క సాక్షి మీడియా ఆఫీస్ నుంచి అలాంటి కథనాలు వినపడటం లేదు. కొంత మంది సాక్షి ఉద్యోగస్తులు ఇలా వైఎస్ జయంతి వేడుకలు చేయకపోవడాన్ని నొచ్చుకున్నారని. పెద్దాయనను స్మరించుకోవడం ఎంతో అవసరమని గుసగుసలాడుకున్నారట.

సాక్షి యాజమాన్యం నిన్న యధావిధిగా ఆఫీస్ కు వచ్చి వారి పనులు వారు చేసుకొని ఎవరిదారిన వారు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ప్రతిక్షణం వైఎస్ నే స్మరించే సాక్షి మీడియా ఆఫీస్ లోనే ఇలా జయంతి వేడుకలు చేయకపోవడం అవమానకరమైన విషయమే. వైఎస్ భారతి హైదరాబాద్ లో ఉండేటప్పుడు ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకునేవారు. ఇప్పుడు వైఎస్ జగన్ ఏపీ సీఎం కావడంతో కుటుంబమంతా తాడేపల్లి ఉంటున్నారు. ఇలా ప్రతి దానికి వైఎస్ భారతి లేదా సీఎం వైఎస్ జగన్ చెబితేనే చేయాలి అన్న ధోరణి కొనసాగడం మాజీ సీఎంను అవమానించుకోవడమే.

వైఎస్ సీఎంగా ఉన్న రోజులలో పురుడు పోసుకున్న సాక్షి ఛానల్ లో ఇలాంటివి ముందు ముందు రిపీట్ కాకుండా చూసుకోవలసిన బాధ్యత యాజమాన్యం మీద తప్పకుండ ఉంది. మొదట సాక్షి ఛానల్ లో పచ్చ పార్టీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎక్కువగానే ఉన్నారని, వారితోనే కొంత పేచీ వస్తుందని… చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కొన్ని వార్తల విషయంలో కూడా గతంలో చూసి చూడనట్లు వ్యవహరించే వారని అలాంటి వారిని ముందుగానే పసిగట్టి సాగనంపితే వైఎస్ జగన్ తో పాటు, సాక్షిలో వైఎస్ జగన్ మీద ఉన్న ప్రేమతో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మంచి వాతావరణం కల్పించినవారవుతారని వ్యాఖ్యానిస్తున్నారు.  
  •  
  •  
  •  
  •  
  •  
  •