వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి దాదాపుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి అలుపెరగకుండా పోరాటం చేసిన సాక్షి పత్రిక సిబ్బందికి ఇన్ని రోజులకు ఉపశమనం లభించింది. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయంలో గాని కొంత మంది సిబ్బంది రాత్రి పగలు తేడాలేకుండా సీఎం జగన్ కోసం కష్టపడ్డారు. వారిలో ముఖ్యంగా వైఎస్ జగన్ సతీమణి భారతి ముందు వరుసలో ఉంటారు. 

సీఎం వైఎస్ జగన్ కుటుంబం హైదరాబాద్ లో ఉన్న అన్ని రోజులు వైఎస్ భారతి సాక్షి పత్రికకు వచ్చి నేరుగా పర్యవేక్షించేవారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత కుటుంబం మొత్తం తాడేపల్లి మారడంతో వైఎస్ భారతికి హైదరాబాద్ వచ్చి పత్రిక చూసుకునే అంత తీరిక ఉండటం లేదు. ఇక ఈ పత్రికను అంతే బాధ్యతగా చూసుకునేందుకు తాజాగా సూర్యనారాయణ అనే వ్యక్తిని కొత్తగా డైరెక్టర్ పదవి అప్పగించి వ్యవహారాలన్నీ అప్పగించారట.

గత కొన్ని రోజుల క్రితం సాక్షి పత్రికను పటిష్టం చేయడానికి “దైనిక్ భాస్కర్” పత్రిక నుంచి హిందీ వ్యక్తిని తీసుకువచ్చి సాక్షి పత్రిక సీఈఓగా నియమించారు. ఇతను సాక్షి పత్రికను చాల వరకు ప్రక్షాళన చేసారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సూర్యనారాయణ కిందనే కొత్త సీఈఓ పనిచేయాలని చెప్పారట.  ఇప్పటికే సూర్యనారాయను సాక్షి పత్రికలో ఉన్న ఇంచార్జ్ లు అందరకి పరిచయం చేసి, కొన్ని కీలకమైన మార్పులు కూడా చేసారని వార్తలొస్తున్నాయి. కొత్త డైరెక్టర్ సూర్యనారాయణ సాక్షి పేపర్ లో ఎలాంటి మార్పులు చేసి పేపర్ స్థాయిని ఏమాత్రం పెంచుతారో చూడాలి.