కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే సమగ్ర శిక్షకు సంబంధించి 704 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎంఐఎస్ కో ఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టం అనలిస్ట్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ లాంటి పోస్టులు భర్తీకి సిద్ధమయ్యారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఇంజనీర్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదవిఉండాలి. ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. పరీక్ష ఇంగ్లీష్ లేదా తెలుగు బాషలలో ఉంటుంది.

మొత్తం ఖాళీలు : 704

ఎంఐఎస్ కో ఆర్డినేటర్స్ : 144
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 138
సిస్టం అనలిస్ట్ : 12
అసిస్టెంట్ ప్రోగ్రామర్ : 27
ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ : 383

విద్యార్హతలు చూస్తే ఎంఐఎస్ కో ఆర్డినేటర్స్ Bsc కంప్యూటర్స్ లేదా Bsc (MPC) పాస్ కావడంతో పాటు పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉండాలి లేదా బీసీఏతో పాటు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ కు ఏదైనా డిగ్రీతో పాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.

సిస్టం అనలిస్ట్ : బీకామ్, ఎంకామ్, ఎంబీఏ అర్హతతో పాటు టైలి 9, ఈఆర్పీ అకౌంటింగ్ ప్యాకేజీ తెలిసుండాలి.

అసిస్టెంట్ ప్రోగ్రామర్ : ఎంసీఏ లేదా ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ కంప్యూటర్స్ పాస్ కావడంతో పాటు ఒరాకిల్ తెలిసుండాలి.

ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ : ఇంటర్మీడియట్ తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లమో లేదా డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి.

వయస్సు : 2019 జులై ఒకటి నాటికి 34 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : 600 రూపాయలు

సమగ్ర శిక్ష అధికారిక లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి : https://samagrashiksha.telangana.gov.in/

దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 20, 2019
దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 23, 2019