సమంత అక్కినేని వారింటి కోడలైన తరువాత సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇక మరికొద్ది రోజులలో సినిమా ఇండస్ట్రీకి కూడా ఫుల్ స్టాప్ పెట్టనుందని వ్యాఖ్యానాలు కూడా వినపడుతున్నాయి. అందులో భాగంగా గత ఏడాది జూబ్లీహిల్స్ లో ప్రీ స్కూల్ పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నదట. శిల్పారెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముక్తా ఖురాణతో కలసి ఈ స్కూల్ ఏర్పాటు చేయనుందట.

దీని గురించి సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ ప్రీ స్కూల్ కు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఈ స్కూల్ కు “ఏకం లెర్నింగ్” అని పేరు పెడుతున్నట్లు తెలియచేసింది. తాము ఈ స్కూల్ కోసం ఏడాదిగా కష్టపడుతున్నామని, ఇప్పటికి ఈ స్కూల్ పనులు పూర్తి కావచ్చాయని భావోద్వేగంతో పోస్ట్ పెట్టడం జరిగింది. స్కూల్ కు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేస్తామని చెప్పుకొచ్చింది. సమంత నటించిన “జాను” సినిమా గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. ఇక ప్రస్తుతం ఒక వెబ్ సీరియస్ లో నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •