పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ‘యూటర్న్’ సినిమాతో తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన సమంత.. ఇప్పుడు కూడా ఆ సినిమాలవైపు మొగ్గు చూపుతుంది. ఆ తర్వాత ‘ఓ బేబీ’, ’96’ వంటి సినిమాలలో నటించిన సమంత.. ఇప్పుడు తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో ఓ మూగ యువతీ గా సమంత నటించబోతుంది. ఈ సినిమా ద్రిల్లర్ జానర్ లో ఉండబోతుందట. సమంతను ఇప్పటివరకు చూపించని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇక అశ్విన్ శరవణన్ గతంలో నయనతారతో ‘మాయ’, తాప్సితో ‘గేమ్ ఓవర్’ వంటి సినిమాలను తెరక్కించాడు. ఆ రెండు సినిమాలు ద్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సాగాయి. ఇప్పడు సమంతతో తీయబోయే సినిమా కూడా ద్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందని అంటున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ప్రస్తుతం సమంత.. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

‘సర్కార్ వారి పాట’.. కీలక పాత్రలో విద్యాబాలన్..!

మెగా ఫ్యామిలిలో కరోనా.. నాగబాబు అధికారిక ప్రకటన..!

ఏటిఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఎస్‌బీఐ కొత్త రూల్..!