హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత సమంత సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచినా “96” సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ “జాను” సినిమాగా సమంత – శర్వానంద్ కలయికలో గత వారం విడుదలైంది. ఈ సినిమాపై సమంత ఎన్నో అంచనాలు పెట్టుకున్నా అనుకునంత విజయం సాధించినట్లు కనపడటం లేదు.

దీనితో సమంత కూడా కాస్త నిరాశను కనపరిచినట్లు చెబుతున్నారు. ఈ సినిమా తరువాత “ఆర్ఎక్స్ 100” దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో “మహాసముద్రం” అనే సినిమాలో సమంత నటించవలసి ఉంది. ఈ సినిమాలో కూడా శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. కానీ ఇప్పుడు “జాను” సినిమా ప్లాప్ కావడంతో సమంత తన మనస్సు మార్చుకొని “మహాసముద్రం”లో చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే “మహాసముద్రం” యూనిట్ కు ఈ విషయం చెప్పడంతో వారు షాక్ కు గురయ్యారట. దీనితో ఇప్పుడు అజయ్ భూపతి ఈ సినిమాలో హీరోయిన్ కోసం మరొకసారి సెర్చింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. “మహాసముద్రం”లో హీరోయిన్ సెట్ కాకా కిందా మీద పడుతున్న దర్శకుడికి సమంత ఇప్పుడు సైడ్ ట్రాక్ తీసుకోవడంతో మరొకసారి సినిమా మొదలు పెట్టడానికి సమయం పట్టేలా ఉంది. సమంత ప్రస్తుతానికి కాస్త సమయం తీసుకుని మరొక సినిమా ఎంపిక చేసుకుంటుందేమో చూడాలి.