పూజ హేగ్దే నిన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సమంత అంత అందంగా ఉంటుందని తాను అనుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలతో సమంత అభిమానులు పూజ హేగ్దెను ట్యాగ్ చేస్తూ పిచ్చెక్కించారు. దీనితో పూజ హేగ్దే తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారని, ఈ విషయం తన డిజిటల్ టీమ్ చెప్పిందని తాను ఎలాంటి పోస్టులు సమంత గురించి పెట్టలేదని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. ఈరోజు సమంత తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో లైవ్ చాట్ లో పలు విషయాలను వెల్లడించింది.

తనను ఎవరైనా ఎక్కువగా పొగిడితే బద్ధకం పెరిగిపోతుందని, అందుకే తనను ద్వేషించేవారిని స్ఫూర్తిగా తీసుకుంటానని, అందుకే తనను ద్వేషించేవారికి థాంక్స్ అంటూ పూజ హేగ్దెకు రివర్స్ పంచ్ ఇచ్చింది. తన అభిమానులు చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందని, తాను ఇంత మంది అభిమానులను పొందగలిగినందుకు ముచ్చటేస్తుందని తన అత్త అమల గారు తనకు ఫ్రెండ్ గా సలహాలిస్తుంటారని అభిమానులతో షేర్ చేసుకుంది.

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?