భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ భారత జట్టుతో ఆడే సమయంలో “వాల్”గా మంచి పేరు గడించాడు. అతడిని అవుట్ చేయాలంటే ప్రత్యర్థి జట్టు ఆపసోపాలు పడాల్సిందే. అతడి కెరీర్ లో కొన్ని సార్లు కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ఇలా అతడికి వచ్చిన ప్రతి అవకాశాన్ని భారత్ జట్టు కోసం పరిపూర్ణంగా తన సేవలను అందచేసాడు. ఇప్పుడు అండర్ 19 కుర్రాళ్లకు పదును పెడుతూ వారిలోని ప్రతిభను వెలికితీసే పనిలో ఉన్నాడు. అండర్ 19 జట్టుకి కోచ్ గా వారిని తీర్చి దిద్ది భారత్ జట్టుకి ఎంతో మంది యువ క్రికెటర్లను తయారు చేస్తున్నాడు.

ఇక రాహుల్ ద్రావిడ్ దారిలో అతడి కొడుకు కూడా మంచి క్రికెటర్ గా భారత్ జట్టుకి సేవలందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ద్రావిడ్ కొడుకు సమిత్ అండర్ 14లో దుమ్మురేపుతున్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండు డబల్ సెంచరీస్ సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచాడు. బీటీఆర్ షీల్డ్ టోర్నీలో మాల్యా అతిధి స్కూల్ తరుపున ఆడిన సమిత్… శ్రీకామరాన్ జట్టుపై డబల్ సెంచరీస్ సాధించాడు. అటు బౌలింగ్ లోను రాణించి రెండు వికెట్లు తీసుకోవడం గమనార్హం. గత డిసెంబర్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ XI తరుపున ఆడిన సమిత్ 201 పరుగులు చేయడం జరిగింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •