గత కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక ప్రాంతం చిగురుటాకులా వణికిపోతుంది. ఉత్తర కర్ణాటకలో పడుతున్న వర్షాలకు దాదాపుగా 2700 గ్రామాలు వరదలలో మునిగిపోగా 40 మందికి పైగా మరణించారు. ఇక ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంతో పాటు, సినిమా హీరోలు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

అందులో భాగంగానే ఉత్తర కర్ణాటకలో వరదలు వల్ల తన మనస్సు కలచి వేసిందని, కన్నడ ప్రజలు తెలుగు సినిమాను కొన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారని, తనను కూడా “హృదయ కాలేయం” సినిమా నుంచి ఆదరిస్తున్నారని అక్కడ ప్రజలను ఆదుకునే దానిలో భాగంగా తన వంతుగా 2 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటిస్తున్నానని అన్నారు. సంపూ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ అపాయం సంభవించినా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ముందుగా తన వంతు సహాయం అందిస్తుంటాడు. ఇన్ని రోజులుగా సంపూ చెప్పినట్లు తెలుగు సినిమాలను ఆదరిస్తున్న ఉత్తర కర్ణాటక ప్రజల కోసం మన హీరోలు కదలి ముందుకు వస్తారో లేదో చూద్దాం.

  •  
  •  
  •  
  •  
  •  
  •