దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ 71ను ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఫిబ్రవరి 24 నుండి శాంసంగ్‌ ఒపెరా హౌస్, శాంసంగ్.కామ్‌తో పాటు ప్రముఖ ఆఫ్ లైన్ పోర్టల్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఇక దీనిలో మెరుగైన భద్రత కోసం శాంసంగ్‌ నాక్స్ ఏఫీచర్‌ను కూడా జోడించింది. టెస్ట్ మెసేజింగ్ యాప్ లో విజువల్ కార్డులు, రిమైండర్లు ఆఫర్ల రూపంలో ఉంటాయి. అలాగే వినోదం, ఈ కామర్స్, ఆహరం, ట్రావెల్ డొమైన్లలో కంటెంట్ కోసం శోధించేందుకు వీలుగా ఫైండర్ అలాగే సింగల్ ట్యాప్ తో స్క్రీన్ షాట్ సేవ్, స్మార్ట్ క్రాప్ ఫీచర్స్‌ అందిస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ 71 ఫీచర్లు:

6.70 అంగుళాల ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
1080×2400 పిక్సెల్స​ రిజల్యూషన్‌
8 జిబిర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
64+ 12+ 5+ 5 ఎంపీ రియర్‌ క్వాడ్‌కెమెరా
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

  •  
  •  
  •  
  •  
  •  
  •