‘గరుడవేగ’ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన సీనియర్ హీరో రాజశేఖర్.. తన కొత్త సినిమా కోసం సంచలన అంశాన్ని ఎంచుకున్నాడు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను వెల్లడించడంలో చేసిన పొరపాట్ల కారణంగా కొందరు విద్యార్థులు మనస్థాపానికి లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభత్వాన్ని కుదిపేసిన ఈ అంశంపై రాజశేఖర్ సినిమా తీస్తున్నాడు.

‘ఆంధ్రాపోరి’ ఫేం రాజ్ ముదిరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రొఫెసర్, లాయర్ గా రాజశేఖర్ నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.