గత ఆరు నెలలుగా లాక్ డౌన్ కారణంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదాయం లేక అల్లాడిపోతున్నాయి. ఇక ఏపీలో అయితే కరోనా సమయంలో కూడా ప్రజలకు తాము ఇస్తానన్న హామీలను అమలు చేసుకుంటూ శభాష్ అనిపించారు. అప్పో సోప్పో చేసి ప్రజలకు అయితే ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా జగన్ సర్కార్ చూసుకుంది. కానీ ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టడంతో నిన్న పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి చొప్పున పెంచి 600 కోట్ల రూపాయలను అధికంగా రాబట్టాలని మంచి పథకమే వేసింది. వీటిని రోడ్ల శాఖకు కేటాయించి ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల మేర కేటాయించి పాడైపోయిన రోడ్లను బాగుచేయించుకోమని నిధులు మంజూరు చేస్తారట.

ఇక నిన్న పెట్రోల్, డీజిల్ పై రేట్లను పెంచడంతో అది కచ్చితంగా వాహనాలపై పెను భారం పడుతుంది కదా, ఇప్పుడు దానిని అధిగమించడానికి అని చెబుతూ ఇసుక ధరను టన్నుకు 100 రూపాయలు పెంచుతూ APMDC ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్ లో ఇసుకను కనుక బుక్ చేసుకుంటే టన్నుకు 375 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు అది అంటే 30 శాతం పెరిగి 475 రూపాయలకు చేరుకోనుంది. రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఇలా పెంచవలసి వస్తుందని సమాధానం చెబుతున్నారట. APMDC ప్రతిపాదనలు సిద్ధం చేసినా దీనికి ప్రభుత్వం ఆమోదం తెలియచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 12 టన్నుల లారీకి 4500 చొప్పున వసూలు చేస్తుండగా ఇప్పుడు అది 5700కు చేరుకుంది. ట్రాక్టర్ ఇసుక గతంలో 1687 రూపాయలు ఉండగా ఇప్పుడు 2137 రూపాయలకు చేరుతుంది. దీనితో ప్రభుత్వం ఘననీయంగా ఆదాయం పెంచుకునే అవకాశం లభిస్తుందని చెప్పుకోవచ్చు.