సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్ తో పాటు… బాలీవుడ్ లో కూడా హల్ చల్ చేస్తున్న పేరు. తాను దర్శకత్వం వహించిన రెండు బాషలలో ఒకే కథ “అర్జున్ రెడ్డి” “కబీర్ సింగ్” సూపర్ హిట్ కావడంతో ఎవరితో సినిమా చేయాలి… ఎలాంటి సినిమా చేయాలని తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. తెలుగులో “అర్జున్ రెడ్డి” సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకొని మహేష్ కు కథ కూడా వినిపించాడు.

కానీ మహేష్ బాబు బౌండెడ్ స్క్రిప్ట్ తో రావాలని చెప్పడంతో కొంత సమయం తీసుకున్నాడు. ఆ సమయంలో బాలీవుడ్ ఆఫర్ రావడం అక్కడ “కబీర్ సింగ్” హిట్ టాక్ తెచ్చుకోవడం చక చక జరిగిపోయాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అడిగినంత డబ్బు… బాలీవుడ్ స్టేటస్ మొత్తం కళ్ల ముందు కనపడుతుంది. దానితో తాను టాలీవుడ్ వైపు చూడకుండా బాలీవుడ్ వైపే పరుగులు తీసి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నాడు.

మహేష్ బాబుతో సినిమా చేయాలనుకునప్పుడు కథ విని ఒకే చేస్తే సినిమా ఉండేదేమో… కానీ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురావాలని చెప్పడం కాస్త సమయం అడగటం.. అంతలో బాలీవుడ్ ఆఫర్ ఇలా ఒకదాని వెంట ఒకటి పరుగులు తీసుకుంటూ వచ్చేసాయి. మహేష్ బాబు ఈ మధ్య బౌండెడ్ స్క్రిప్ట్ వినకుండా ఏ సినిమాను అంగీకరించే పరిస్థితి కనపడటం లేదు. అందుకే సుకుమార్ సినిమా కూడా కన్ఫర్మ్ అయిన తరువాత రద్దు చేసుకోవడం జరిగింది. సందీప్ రెడ్డి వంగా అయితే మహేష్ తో సినిమా పక్కన పెట్టి బాలీవుడ్ లో సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు. ఒకవేళ అక్కడ సినిమా ప్లాప్ అయిందనుకోండి తిరిగి టాలీవుడ్ వచ్చి మహేష్ కు కథ చెబుతాడేమో… హిట్ అయ్యిందా టాలీవుడ్ జనాలకు అందనంత బిజీ బిజీ డైరెక్టర్ గా మారిపోతాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •