సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయదేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత హిట్ అయిందో చూసే ఉంటారు. ఆ సినిమాలో విజయ్ చూపించిన యాటిట్యూడ్ తో కుర్రకారు మొత్తం ఫిదా అయిపోయారు. ఇక ఆ తరువాత నుంచి విజయ్ హీరోగా వచ్చిన ప్రతి సినిమాకు మొదటి రోజు సూపర్ కలెక్షన్స్ రావడంతో ఆ సినిమా విజయ్ కెరీర్ కు ఎంత హెల్ప్ అయిందో తెలుస్తుంది.

ఈమధ్య విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలు వరుస పెట్టి ప్లాప్ టాక్ రావడంతో పాటు, అతడి కెరీర్ మసకబారుతున్న వేళ తన యాటిట్యూడ్ లో చేంజ్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ విజయ్ కు జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈమధ్యే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అర్జున్ రెడ్డిని పోలి ఉన్న యాటిట్యూడ్ తో విజయ్ మరోసారి యువతను ఆకట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాపై విజయ్ మంచి నమ్మకం పెట్టుకున్నా… గత సినిమాల ప్లాప్ టాక్ దృష్ట్యా ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా సూచనలు సలహాలు పాటిస్తున్నాడట. సందీప్ రెడ్డి వంగాను ఈ సినిమాలో భాగం చేస్తూ అతడు చెప్పిన కొన్ని చోట్ల సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారట. విజయ్ దేవరకొండతో ఉన్న చనువుతో సందీప్ వంగా ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ… పూరి జగన్ దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉంది. సందీప్ రెడ్డి వంగా కూడా బాలీవుడ్ లో సినిమా తీయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సందీప్ రెడ్డి వంగా సూచనలు సలహాలు ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.