‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలన హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తరవాత విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాడు. ఇప్పడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసిన విధానం నచ్చి సందీప్ కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా ‘అర్జున్ రెడ్డి’ ని ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసాడు సందీప్. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా 200 కోట్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక మొదట సినిమాతోనే బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సందీప్ కి స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. క్రైమ్ ద్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •