బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం పీక్ స్టేజ్ కు చేరుకుంటే మరొకవైపున కన్నడ సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. హీరోయిన్ సంజన, రాగిణి డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. వీరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు పలువిధాలుగా విచారణ చేపట్టి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది. వీరిద్దరికి రౌడీ షీటర్లతో పాటు అండర్ వరల్డ్ డాన్ లతో కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేల్చడంతో పాటు దానికి సంబంధించిన కీలక విషయాలను రాబట్టారు.

హీరోయిన్ సంజనపై వేసిన అనేక ప్రశ్నలకు ఆమె తడబాటుకు గురి కావడంతో పాటు బోరున ఏడ్చినట్లు తెలుస్తుంది. తనను విచారిస్తున్న సమయంలో పలుమార్లు ఏడుపుతోనే సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించిందట. అన్ని బాషలలో కలిపి ఆమె 42 సినిమాలు మాత్రమే చేయడంతో పాటు అవికూడా అన్ని చిన్న చిన్న చిత్రాలు అయినప్పటికీ చాలా మంది హీరోలు, హీరోయిన్ ల కన్నా ఆమె సంపాదన చాలా ఎక్కువగా ఉందట. దీనిపై అధికారులు నీకు ఎక్కడ నుంచి సంపాదన వస్తుంది, తల్లితండ్రుల నుంచి ఎంత ఆస్థి సంక్రమించింది అనే కోణాలలో కూడా విచారణ జరిపి ఆదాయపు పన్ను శాఖకు ఈడీ అధికారులు ఆమె ఆస్తులపై తమకు పూర్తి వివరాలు కావాలని లేఖలు రాసినట్లు తెలుస్తుంది.

మరొకవైపున సంజన బెయిల్ కోసం ఇప్పటికే పలువురు లాయర్లను సంప్రదించి ఎలాగైనా హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. అధికారులు మాత్రం ఆమెకు బెయిల్ వచ్సినా తదుపరి విచారణ కోసం ఆమెను అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఏకంగా అండర్ వరల్డ్ డాన్ లతోనే సంబంధాలు పెట్టుకోవడంతో సంజనను మరింత విచారిస్తూ చాలా కీలక విషయాలు రాబట్టవచ్చని ఆలోచిస్తున్నారట. మరొకవైపున ఆమెతో టచ్ లో ఉన్న రౌడీ షీటర్లు గట్రా బ్యాచ్ పై ఇప్పటికే నిఘా వేసి డ్రగ్స్ ఏ రూపంలో ఎంతమందికి చేరుతుందో మొత్తం కూపీలాగే పనిలో ఉన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీపై పట్టుకోసం సీఎం జగన్ కు దొరికిన మరో అస్త్రం

వైసీపీ కేంద్ర బీజేపీలో చేరడానికి సిద్ధమా? కానీ కండిషన్స్ అప్లై