దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు సజావుగా నడుస్తున్నాయి. మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఓటు వేసిన తరువాత చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు. మధ్యాహ్నానికి పోలింగ్ సరళి చూసి ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని, తన ఓటు కూడా తనకు పడిందో లేదో తెలియదని హడావిడి చేసారు. ఇదంతా ప్రజలంతా పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరడంతో పాటు ఓట్లన్నీ గంపగుత్తుగా ప్రజలు వైసీపీ పార్టీకే వేస్తున్నారని అనుమానంతోనే హడావిడి మొదలెట్టారు.

ఇప్పుడే ఇదే తీరుని మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కూడా వ్యాఖ్యానిస్తూ నా కూతురు గెలిస్తే ఈవీఎంలు సరిగ్గా పనిచేసినట్లని, లేకపోతే ఈవిఎంలలో ఏదో తప్పు దొర్లిందనట్లు మాట్లాడటం విశేషం. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ప్రచారం కోసమని మహారాష్ట్ర వెళ్లి వచ్చి శరద్ పవర్ ను కలిసి వచ్చారు. అప్పటి నుంచి శరద్ పవర్ కూడా చంద్రబాబు నాయుడులా వింత వింతగ మాట్లాడుతున్నట్లు కనపడుతుంది. శరద్ పవర్ కు కూతురు మీద ఉన్న ప్రేమ ప్రజలకు మంచి చేయడంలో కూడా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.

ఇదే శరద్ పవర్ కేంద్ర మంత్రిగా ఉన్న 2004 , 2009 ఎన్నికలలో అదే ఈవీఎంలు ఉపయోగించారు కదా. అంటే గెలిస్తే ఈవీఎంలు బహు గొప్పగా పనిచేసాయి, ఓడిపోతే ఈవిఎంలలో ఏదో లోపం ఉంది. ఇలాంటి ట్రిక్స్ అన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగిస్తారు. ఇప్పుడు కొత్తగా యుపిఎ నాయకులతో బాబు సఖ్యతగా ఉంటున్నారు కదా. బాబు ఆలోచనలను వారితో పంచుకొని వారి చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారా అనేలా ఉన్నాయి.