సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్నాడు. ఇక 13 ఏళ్ళ విరామం తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఓ సంఘటనను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా సెట్లో మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాష్ రాజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సరదాగా నవ్వుతు ఏదో విషయాన్నీ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన ఫోటో సోషల్ మీడియాల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇక ప్రొఫెసర్ భారతిగా ఈ సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా ప్రొడక్షన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.