మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాకు సంబంధించి ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు నాడు చిన్న టీజర్ ఒకటి విడుదల చేసారు. ఈ టీజర్ తోనే సినిమాపై ఉన్న హైప్ రెట్టింపైందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ మేజర్ “అజయ్ కృష్ణ” పాత్రలో నటించనున్నాడు. 

గత నెలలో 15 రోజుల లాంగ్ షెడ్యూల్ లో కాశ్మీర్ లో ఆర్మీ పాత్రకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఈ సినిమాలో ఆర్మీ పాత్ర మొదట 25 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. ఆ తరువాత అజయ్ కృష్ణ పాత్ర ఆంధ్రప్రదేశ్ లోని తన హోమ్ టౌన్ కు షిఫ్ట్ అవుతుందట. తక్కువ నిడివిగల ఆర్మీ పాత్ర అయినప్పటికీ సినిమాకు హైప్ తెచ్చే పాత్ర కావడంతో దానిని దర్శక, నిర్మాతలు గట్టిగానే వాడనున్నారు. అల్లు అర్జున్ గత చిత్రం “నా పేరు సూర్య”లో ఆర్మీ రోల్ నిడివి చాల చిన్నదైనప్పటికీ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ అన్ని ఆ పాత్రపైనే తిరిగిన సంగతి తెలిసిందే. 

ఇక ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు పుట్టిన రోజునాడు విడుదలైన టీజర్ పట్ల మహేష్ బాబు ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంత్రి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •