సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. ప్రీమియర్లు చూసిన అభిమానులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల షోలు మొదలయ్యాయి. మహేష్ బాబు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా సాగిందట. ఫస్ట్ హాఫ్ ట్రైన్ ఎపిసోడ్ బాగా నవ్విస్తుందట. జబర్దస్త్ కమిడియెన్స్ తో చేయించిన కామిడి సినిమాకు మరో ప్లస్ గా మారిందంటున్నారు.

ఇక సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించినట్లు చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలు సాగతీతగా ఉన్నాయని.. ప్రీ క్లైమాక్స్ లో వేగం పెరిగినట్లు అనిపించిన క్లైమాక్స్ చప్పగా ఉందని ట్వీట్లు చేశారు. ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి నటన బాగుందని.. సినిమా మొత్తంగా చూచుకుంటే ఓ మంచి మాస్ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.

ఇక మహేష్ బాబు ఎప్పటిలాగానే తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడని.. మరోసారి ఈ సినిమా ద్వారా మహేష్ హిట్ కొట్టాడని అంటున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మించారు.