‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ‘గీతా గోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఇప్పటికే షూటింగ్ మొదలు కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా లేట్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని తెలుస్తుంది. నవంబర్ లో అమెరికాలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారట.

ఈ సినిమా కథ రీత్యా అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండడంతో అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అక్కడ హీరో, హీరోయిన్ తదితర ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడని తెలుస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జిఏంబి ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

15 రోజుల్లోగా ఆస్తుల వివరాలు ఆన్లైన్ చేయాలి..!

భారీ ఫీచర్లతో తక్కువ ధరలో ‘పోకో ఎక్స్ 3’..!