సరిలేరు నీకెవ్వరు’ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ విలన్ గా నటించబోతున్నాడని తెలుస్తుంది. అనిల్ కపూర్ ఈ సినిమాలో నటించడం ద్వారా సినిమాకు మరింత హైప్ వస్తుందనే ఉద్దేశంలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నవంబర్ లో అమెరికాలో మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు డిజిటల్ రైట్స్ సహా శాటిలైట్ హక్కులను భారీ ధరకు విక్రయించారని తెలుస్తుంది. ఓ ప్రముఖ సంస్థ 35 కోట్లు వెచ్చించి రైట్స్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైందని సమాచారం. ఇంకా హిందీ సహా ఇతర భాషల శాటిలైట్ హక్కుల వ్యాపారం, డబ్బింగ్ హక్కుల వ్యాపారం పెండింగ్ లోనే ఉన్నాయి.

ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మహేష్ బాబు-పరుశురాం కాంబినేషన్ లో ఈ సినిమా రావడంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయి.

17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

తెలంగాణ సీఎం సంచలనం.. ఇక పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు..!

చిక్కుల్లో స్టార్ హీరో.. కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ హైకోర్టు జడ్జి ఆగ్రహం..!