శర్వానంద్-సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం 30 వ సినిమాగా తెరకెక్కుతుంది.

కాగా ఈ సినిమాకు జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించనున్నాడు. మొదటి సారి శర్వా -సమంత జంటగా నటించనుండడం అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో, ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.