తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు శశికళ నటరాజన్ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బెంగుళూర్ జైలులో ఉన్న శశికళ ఈ నెలాఖరున విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో నాలుగేళ్లు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. సత్ప్రవర్తన కారణంగా ముందే విడుదలవుతుందని ఆమె తరుపున న్యాయవాది సెంధూర్ పాండ్యన్ తెలిపారు.

ఇక తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో శశికళ విడుదల కాబోతుందనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక తమిళనాడులో ఇప్పటికే సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. ఈ నేపథ్యంలో శశికళ బయటక వస్తే రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని అంటున్నారు.

సురేష్ రైనా సంగతి తేల్చే పనిలో CSK, శ్రీనివాసన్ అయితే చాలా కోపంగా ఉన్నారట

ఆకట్టుకుంటున్న ‘జేమ్స్ బాండ్’ ట్రైలర్..!