మహానటి సావిత్రి అంటే… ఇప్పుడు అందరకి “మహానటి” సినిమా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా ప్రేక్షకుల హృదయాలలో అంతలా గుర్తుండి పోయింది. ఈ సినిమాలో సావిత్రిగా చేసిన కీర్తి సురేష్ అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి సావిత్రి పాత్రలో నిత్య మీనన్ నటిస్తుంది. దానికి సంబంధించి పిక్ ఇప్పుడు బయటకు వచ్చింది.

గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి కలసి నటించారు. ఆ సినిమాలో సావిత్రి పప్పు రుబ్బుతుంటే, ఎన్టీఆర్… బుల్లెమ్మా నేను ఒక పట్టు పట్టనా అంటూ ఎన్టీఆర్ పప్పు రుబ్బే సీన్ చిత్ర యూనిట్ బయటపెట్టింది. మొదటిగా సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ను అడిగారని, కానీ కీర్తి సురేష్ ఇప్పటికే మహానటిలో నటించడంతో సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. బొద్దుగా ఉండే సావిత్రి పాత్రలో నిత్య మీనన్ కరెక్ట్ గా సరిపోయిందని ఈ లుక్ చూస్తుంటేనే తెలుస్తుంది. అలనాటి ఎన్టీఆర్ చిత్రాలలోని గుర్తుండి పోయే సీన్స్ మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ లో చూడనున్నామని ఈ ఫొటోతో అర్ధమవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం జనవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •