మన శరీరంలో అన్ని భాగాలు మన మాట వినకుండా అందులో ఒక భాగం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న సవ్యసాచి సినిమాపై ప్రేక్షకులలో ఎంత క్యూరియాసిటీ నెలకొని ఉందో, అంతే క్యూరియాసిటీతో సినిమా మొత్తం చూడగలిగితే సవ్యసాచి హిట్ అయినట్లు లెక్కే.

ఎడమ చెయ్యి అనే కాన్సెప్ట్ తో సినిమాను మొదలు పెట్టి దర్శకుడు సినిమా కొంత భాగం నడిచాక, ఆ చెయ్యికి సంబంధించి స్టోరీని ముందుకు తీసుకువెళ్లకుండా ప్రేమ, దోమ అంటూ అర్ధం పర్ధం లేని కథనాన్ని జోడించి సినిమాని పక్కదారి పట్టిస్తాడు. సినిమాకు కావలసిన కీలకమైన పాయింట్ పక్కన పెట్టి, స్క్రీన్ ప్లే ఒక తీరుగా ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ బ్రేకులు పడుతుంటే చూసే ప్రేక్షకుడికి కూడా ఆసక్తి సన్నగిల్లుతుంది.

ఈసినిమా కాన్సెప్ట్ ఎడమ చేతితోనే ముడిపడి ఉందని ఎంత చెప్పినా ఆ చెయ్యి అలంకరణకు మాత్రమే పనికి వచ్చింది తప్ప కథకు బలంగా మాత్రం మారలేదు. విలన్ క్యారెక్టర్ లో మెరిసిన మాధవన్ ఫుల్ స్టాప్ డైలాగ్స్ తో పాటు, వెకిలి నవ్వులకే పరిమితమవుతుంది తప్ప, ధ్రువ సినిమాలో అరవింద స్వామి క్యారెక్టర్ అంత గొప్పగా ఉంటుందని చెప్పి మాటల వరకే పరిమితమయ్యారు.

సినిమా మొత్తం మీద ఒకటి, రెండు సంధర్బాలలోనే ఎడమ చెయ్యికి సంబంధించి ప్రస్తావన ఉంటుంది తప్ప, మిగతా అంతా ఒక మాములు సినిమా చూస్తున్న భావనే కలుగుతుంది. సినిమా రెండవ భాగంలో హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్ నడుస్తున్న సమయంలో ప్రేక్షకుడు చాల ఇంట్రెస్టింగ్ గా సినిమా చూస్తున్న సమయంలో మధ్యలో హీరోయిన్ రావడంతో సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది. అంత వరకు ఒకరకమైన మూడ్ లో ఉన్న ప్రేక్షకుడిని ఒకేసారి కామెడీ ట్రాక్, ఒక సాంగ్ తో సినిమాను పక్క దారిపట్టిస్తాడు.

ప్రేక్షకుడు సినిమాను చూసే సమయంలో ఒక మూడ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ సీన్ అలానే కొనసాగింపు ఉంటే, సినిమాపై పట్టు నిలిచి ఉంటుంది. కానీ అర్ధం పర్ధం లేని స్క్రీన్ ప్లై తో సినిమాకు ఉన్న ఫ్లో దెబ్బ తినేలా దర్శకుడి వ్యవహరించినట్లు కనపడుతుంది. ప్రథమార్ధంలో కూడా ఇదే సమస్యతో రొటీన్ లవ్ స్టోరీ, కామెడీ ట్రాక్ తో పూర్తిగా సినిమాపై దర్శకుడు పట్టు కోల్పోయాడు.

హీరో ఎడమచేతికి సంబంధించి సినిమా చివర్లో రివీల్ చేద్దామనుకున్న దర్శకుడికి అప్పటి వరకు ప్రేక్షకుడు సహనంగా ముందు థియేటర్ లో కూర్చోవాలి కదా. హీరో, విలన్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు లేనప్పటికీ పోరాట సన్నివేశాలలో నేపధ్య సంగీతం బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ అవసరం లేకపోయినా బలవంతంగా జోడించినట్లు కనపడుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. కీరవాణి సంగీతంలో సవ్యసాచి టైటిల్ సాంగ్ తో పాటు, వై నాట్ సాంగ్స్ బాగుంటాయి. రెండవ భాగంలో కథకు కీలకమైన అంశాలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయడంలో కీరవాణి సక్సెస్ అయ్యారు.

నాగ చైతన్యకు ఈ సినిమాలో యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్ర వచ్చినా దానిని పూర్తిగా సద్వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. చందు మొండేటి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా కమర్సియల్ సినిమా జోన్ లో నుంచి బయటకు రాలేక, సినిమాకు ఎంచుకున్న పాయింట్ మర్చిపోయి పక్క దారిలోకి వెళ్లడంతో సినిమా కూడా ప్రేక్షకుడి నుంచి పక్కదారి పట్టింది.

చివరిగా : సవ్య”చాచి పెట్టి కొట్టింది”
రేటింగ్ : 2.25/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి