స్టాక్ మార్కెట్లో జరిగిన భారీ మోసం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ఇందులో సూత్రదారి. అతడి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’. స్టాక్‌ మార్కెట్లు, బ్యాంకుల కార్యాకలాపాల్లోని లొసుగులు పసిగట్టిన హర్షద్‌ మెహతా రూ.5వేల కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో హర్షద్ మెహతాగా ప్రతీక్ గాంధీ నటిస్తున్నారు. కాగా అక్టోబర్ 9 నుండి సోనీ లివ్‌ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.