జాబిల్లిపై ఇప్పటికే అనేక దేశాల ప్రజలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఈమధ్య చందమామపై ప్రయోగంలో భాగంగా భారత్ “చంద్రయాన్ 2” ప్రయోగంతో చివరి నిమిషంలో తడబడటంతో పూర్తి స్థాయి విజయం సాధించలేదు. ఇక చందమామ, అంగరకుడిపై మానవుడు నివాసానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలకు సంబంధించి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోగలిగితే ఆహారం ఎలా సంపాదించుకోవాలనే దానిపై కూడా శాస్త్రవేత్తలు ప్రయోగాలలో సక్సెస్ అయ్యారు.

అంగారకుడు, చందమామపై పోలినటువంటి మట్టితో నెదర్లాండ్స్ కు చెందిన వెజ్ నింజన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు వివిధ రకాల ,పంటలు పండించి విజయం సాధించారు. వారు సాగు చేసిన వాటిలో టమోటా, మెంతికూర, బఠాణి, ముల్లంగి వంటి పంటలు ఏపుగా పెరగగా, పాలకూర మాత్రం అనుకున్న స్థాయిలో పెరగలేదట. వీటి ద్వారా లభ్యమైన విత్తనాలు తిరిగి సాగుకు పనికొచ్చేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియచేసారు. ఇంకా దీనిపై ప్రయోగాలు చేస్తున్నామని, మరింత ముందుకు వెళ్లి మరికొన్ని ప్రయోగాలతో ఆయా గ్రహాలపై పరిశోధనలు చేస్తున్నామని తెలియచేసారు.