ఇప్పటికే రైనాకు సంబంధించి తన మోకాలికి శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పడంతో, మాజీ క్రికెట్స్ మరియు రైనా వెల్ విషర్స్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టడం జరిగింది. ఇప్పుడు రైనాకు రెండవ మోకాలికి కూడా శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కాలికి కూడా చికిత్స చేయించుకుంటే మరి కొన్ని రోజులు క్రికెట్ కు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంది.

దీనిపై రైనా మాట్లాడుతూ నాకు రెండవ కాలికి కూడా శస్త్ర చికిత్స అంటే కొంత కఠినమైన విషయమే… దీనితో కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండవలసిన పరిస్థితి. కానీ తాను త్వరగా కోలుకొని మరోసారి క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేసాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •