సంచలనాల జియో మరోసారి వెలుగులు… జిలుగులతో జియో ఫైబర్ పేరుతో మన ముందు కొత్తగా సరికొత్తగా ఆవిష్కరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలియచేసారు. సెప్టెంబర్ 5న మొదలయ్యే జియో ఫైబర్ నెట్ ద్వారా దాదాపుగా 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీ వరకు నెట్ స్పీడ్ అందిస్తామని, ఇంటర్నెట్ స్పీడ్ లోనే సరికొత్త సంచలనానికి నాంది పలుకుతామని చెప్పారు. అమెరికా లాంటి అగ్రదేశంలో కూడా సగటు ఇంటర్నెట్ వేగం 90 ఎంబీపీఎస్ కూడా లేదని ముకేశ్ అంబానీ అన్నారు.

కొత్త చిత్రాలు విడుదలైన రోజే తమ ఇంట్లో సినిమాలు వీక్షించేలా సౌకర్యం తెస్తామని, ఇక నుంచి MNP సేవల పేరుతో ఇంటి వద్దకే చేరుస్తామని అన్నారు. ఇక సెప్టెంబర్ 5న ప్రారంభం అయ్యే జియ్యో ఫైబర్ ద్వారా ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చని, అటు జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా కూడా కాల్స్ ఉచితమని అన్నారు. ఈ సందర్భంగా జియో ఫైబర్ సేవలు 700 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటాయని అన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •