గత వారం భారతీయుడు-2 షూటింగ్ సందర్భంగా చెన్నైలో బారి ప్రమాదం చోటు చేసుకోవడంతో చిత్ర యూనిట్ కు సంబంధించి ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. షూటింగ్ కు సంబంధించి సెట్టింగ్ వేస్తున్న క్రమంలో దాదాపుగా 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ కింద పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా పది మంది వరకు గాయాలపాలయ్యారు. దర్శకుడు శంకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా అతడికి కూడా గాయాలు కావడం జరిగింది.

ఈ దుర్ఘటన గురించి ఈరోజు శంకర్ ట్విట్టర్ లో స్పందిస్తూ తనను ఈ ఘటన చాల కలచి వేస్తుందని, తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, ఆ క్రేన్ ఏదో తన మీద పడినా బాగుండేదని బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతని శంకర్ తెలియచేసారు. ఈ ప్రమాదం జరిగిన తరువాత హీరో కమలహాసన్ చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు ఒకొక్కరకి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •