కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్లన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకున్నా కూడా రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఇక ఇప్పట్లో కరోనా తగ్గే సూచనలు కనిపించకపోవడంతో షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఓటిటి బాట పడుతున్నాయి. ఇప్పటికే నాని ‘వి’ సినిమాతో పాటు అనేక సినిమాలు ఓటిటిలో విడుదలవగా, ఇంకా మరికొన్ని సినిమాలు ఓటిటి బాట పట్టాయి.

ఇక శర్వానంద్ నటించిన తాజా సినిమా ‘శ్రీకారం’. కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాను 14 రీల్స్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. శర్వానంద్ ఇందులో పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, వైరస్ కారణంగా వాయిదా పడింది. కావున ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయబోతున్నారు.

ఇక అనుష్క, సూర్య, రాజ్ తరుణ్ సినిమాలు అక్టోబర్ లో ఓటిటిలో విడుదలవుతుండగా, శర్వానంద్ ‘శ్రీకారం’ కూడా ఓటిటిలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఇప్పటికే ప్రముఖ ఓటిటి సంస్థ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఏపీకి భారీ ఊరట.. తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు..!

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్ వచ్చేసింది..!