వెస్టిండీస్ తో ఇప్పటి వరకు జరిగిన మూడు టీ20, ఒక్క వన్ డే మ్యాచ్ లో శిఖర్ ధావన్ దారుణంగా విఫలమవడంతో అతని కెరీర్ కాస్త డిఫన్స్ లో పడింది. గాయంతో ప్రపంచ కప్ సూపర్ ఫామ్ లో ఉండగా మధ్యలోనే వెనుతిరిగిన ధావన్ విండీస్ టూర్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. అతను ఆడిన నాలుగు మ్యాచ్ లు వరుసగా 1,23,3 ,2 పరుగులతో నిరాశపరిచాడు.

ఇక విండీస్ తో మూడో వన్ డే కు సిద్ధమవుతున్న శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో కనుక ఓడిపోతే తరువాత జరిగే సౌత్ ఆఫ్రికా టూర్ కు సెలెక్ట్ అవ్వడం కష్టమనే భావించవచ్చు. ఏడాది తరువాత టీమిండియాలో స్థానం సంపాదించిన శ్రీయాస్ అయ్యర్ 71 పరుగులతో కీలక సమయంలో కోహ్లీతో కలసి 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •