ప్రముఖ సినీ నటుడు, మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతని కుటుంభ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పిన డాక్టర్లు.. మరో 24 గంటల పాటు డాక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. ఇక ఆయనకు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా శివాజీరాజా 400కు పైగా సినిమాలలో, ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కారు ప్రమాదంలో యువ నటుడు మృతి..!

బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యతో కలకలం..!