ఎన్నికలలో ఇద్దరు చక్కగా కలసి మెలసి పోటీ చేసారు. వారు కోరుకున్నట్లే బీజేపీ – శివసేన పార్టీల పక్షం అధికారాన్ని కైవసం చేసుకుంది. కానీ ఇక్కడే శివసేన పార్టీ అడ్డం తిరిగింది. తమకు రెండునర్ర సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబట్టి కూర్చుంది. మా యువ నాయకుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని మహారాష్ట్ర మొత్తం పోస్టర్లు కూడా వేయించింది. కాబోయే ముఖ్యమంత్రి యువనాయకుడు ఆదిత్య ఠాక్రే అని.

అధికారం కోసం బీజేపీ తప్పకుండా దిగి వస్తుందని శివసేన పార్టీ భావించింది. కానీ బీజేపీ పార్టీ మాత్రం శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే కట్టబెడతామని, అంతకంటే ఇచ్చేది లేదని ఖరాకండిగా చెబుతున్నారు. దీనితో శివసేన పార్టీకి ఏమి చేయాలో పాలుపోక కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి అధికారాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంది. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శివసేనతో కలసి ముందుకు వెళ్లడానికి సిద్ధపడటం లేదు. దీనితో శివసేనకు ఏమి చేయాలో తోచక బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంది. పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ మాత్రం ఎన్నికలకైనా సిద్ధం ముఖ్యమంత్రి పీఠం వదులుకునే పరిస్థితితి లేదంటూనే పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాక్కునే పనిలో వెనకనుండి చేయడంతో శివసేన పార్టీ అలెర్ట్ అయింది.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ ఎరగా వేసి లాక్కోవడానికి చూస్తుందని, కొత్తగా ఎన్నికైన వారిని ధన బలంతో లాక్కోవాలని చూడటం సిగ్గుచేటని అంటుంది. రైతులకు గత బీజేపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని అందుకే తాము ముఖ్యమంత్రి పీఠం ఎక్కలని ఆశిస్తున్నామని చెబుతుంది. మరో వైపున కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీనే ఇలా ఆరోపణలు చేస్తుంది అంటే బీజేపీ పార్టీ ఎంతలా దిగజారిపోయిందో తెలుస్తుందని వ్యాఖ్యానాలు చేస్తుంది. రేపటితో గవర్నర్ ఇచ్చిన గడువు ముగియడంతో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఈరోజు ఎలా మారతాయో చూడాలి. లేకపోతే రాష్ట్రపతి పాలనా పెట్టి మరొకసారి ఎన్నికలకు వెళ్ళవలసి ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికలకు మరోసారి సిద్ధపడటానికి ఇష్టపడని శివసేన పార్టీనే దిగిరావలసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •