మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేయలేకపోవడంతో నిన్న మధ్యాహ్నం గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడంతో శివసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మరింత సమయం ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ పై వెనక్కు తగ్గింది. దీనిపై అత్యవసర విచారణ కోరటం లేదని న్యాయవాది సునీల్ ఫెర్నాండేజ్ తెలిపారు.

తమకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించిన తరువాత కొత్త పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం శివసేనతో కలసి ముందుకు వెళ్లే ఆలోచన ఆమె మదిలో లేనట్లు తెలుస్తుంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొని ఉంది. ఇక మరొకవైపున శివసేన పార్టీ మరొకసారి బీజేపీ పార్టీతో కలసి ముందుకు వెళితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తునట్లుంది.

బీజేపీ నేతలు కూడా శివసేన పార్టీ ఎప్పుడు తమతో కలుస్తామని చెప్పినా తాము స్వాగతిస్తామని చెప్పారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఆఫర్ చేస్తుండటంతో శివసేన తమకు రెండున్నర్ర ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం కావాలని మంకు పట్టు పట్టి కూర్చుంది. కనీసం ఎప్పుడు జీవితంలో గడప తొక్కని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ముందుకు వెళ్లాలని చూస్తున్నా అక్కడ ఇబ్బందులు ఎదురు కావడంతో మరొకసారి ప్రయత్నాలు ముమ్మరం చేసి సుప్రీం కోర్ట్ లో విచారణకు తీసుకొని వెళ్లాలని ఆలోచిస్తుంది.