దాదాపుగా ఏడాది తరువాత టీమిండియాలోకి అడుగుపెట్టి వెస్టిండీస్ తో జరుగుతున్న వన్ డే సిరీస్ లో 5 వ స్థానంలో దిగి 71 పరుగులు సాధించి కోహ్లీతో కలసి 125 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరచడంతో టీమిండియా గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. ఇక తన ఆటపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ, జట్టులో తనకు సుస్థిర స్థానం దొరుకుతుందని భావిస్తున్నానని… జట్టులో ఎక్కువ కలం కొనసాగాలని భావిస్తున్నట్లు… నిలకడ ఎప్పటికి కీలకమని, నా ఆట పట్ల తాను చాల కాన్ఫిడెంట్ గా ఉన్నానని శ్రేయాస్ అయ్యర్ తెలియచేసాడు. ఇక మూడో వన్ డే లో కూడా రాణిస్తే శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలో బెర్త్ ను ఖాయం చేసుకోవచ్చు. ఇప్పటికే 4,5,6 స్థానాల పట్ల టీమిండియాలో కొంత సందిగ్ధత నెలకొని ఉన్న క్రమంలో శ్రేయాస్ కు మూడో వన్ డే కాస్త కీలకం కానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •