ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సిక్కిం డెమెక్రటిక్ ప్రెంట్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రామ్ మాధవ్ సమక్షంలో వీరు పార్టీ మారారు. దీనితో సిక్కిం డెమెక్రటిక్ ప్రెంట్ అధినేత, మాజీ సీఎం పవన్ కుమార్ కు గట్టి దెబ్బ తగిలినట్లైనది. భారతదేశంలో సిక్కింకు ఎక్కువకాలం సీఎంగా చేశారు పవన్ కుమార్.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డెమెక్రటిక్ ప్రెంట్ అధికారం కోల్పోయింది. సిక్కిం క్రాంతికర మోర్చా పార్టీ అధికారం లోకి వచ్చింది. ఈ ఎన్నికలలో డెమెక్రటిక్ ప్రెంట్ 15 సీట్లు గెలవగా, సిక్కిం క్రాంతికర మోర్చా పార్టీ 17 సీట్లు గెలిచింది. తాజా పరిణామాల నేపథ్యంలో డెమెక్రటిక్ ప్రెంట్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ మారడంతో వారి బలం 5కి పడిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిక్కిం క్రాంతికర మోర్చా పార్టీ ఎన్డీయేలో కొనసాగుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •