ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా పేస్ బుక్ ద్వారా తెలియచేసారు. ఇక డాక్టర్ల సూచన మేరకు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పారు. తనకు స్పల్ప కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించగా, సెప్టెంబర్ 9న పాజిటివ్ గా తేలిందని.. తాను ఇప్పడు పూర్తి ఆరోగ్యంలోనే ఉన్నానని చెప్పారు. ఈనెల 22తో తనకు రెండు వారాల క్యారంటైన్ పూర్తవుతుందని.. తరుచుగా సిటీ స్కాన్ తీయించుకుంటున్నానని.. ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు.

కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని.. అందరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. తప్పని సరిగా మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలన్నారు. ఇక క్యారంటైన్ పూర్తయిన తరువాత ఎప్పటిలాగానే నా పని కొనసాగించడానికి సిద్దమవుతున్నానని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు.

డాక్టర్ రెడ్డీస్ చేతికి రష్యా వ్యాక్సిన్.. ‘స్పుత్నిక్-వి’..!

‘సర్కార్ వారి పాట’.. కీలక పాత్రలో విద్యాబాలన్..!