తెలుగు ఇండస్ట్రీలో సింగర్ సునీత తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సునీత తాను పాడిన అద్భుతమైన పాటలతో ప్రేక్షకులకు అంతలా దగ్గరైంది. తాను పాటలు ఒకటే కాకుండా తన గొంతుని కొంతమంది హీరోయిన్స్ కు అరువుగా ఇచ్చి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అదే బాటలో సునీత కూతురు శ్రేయ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

నాగచైతన్య హీరోగా వస్తున్న “సవ్యసాచి” సినిమాలో పాటను నిన్న సాయంత్రం జరిగిన సవ్యసాచి ప్రీ రిలీజ్ పంక్షన్ లో అనంత శ్రీరామ్ రాసిన “చాల చాల చూసా ఇప్పటికే… డోంట్ మైండ్.. చూసి చూడనట్టు వదిలేసేయ్… లవ్ ఐస్ బ్లైండ్” అంటూ సాగే పాటను లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి శ్రేయ అందరిని ఆకట్టుకుంది. శ్రేయ లుక్స్ తో పాటు, హస్కీ వాయిస్, స్టేజి పెర్ఫార్మన్స్ కూడా యువతరాన్ని బాగా ఆకట్టుకుంది.

సింగర్ సునీతకు మొదటి నుంచి అన్ని రకాలుగా అండగా ఉంటూ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సారధ్యంలో కంపోజ్ చేసిన పాటతో తన కూతురు శ్రీయ ఇండస్ట్రీకి అడుగుపెట్టడంతో సునీత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •