యానిమేషన్ మూవీ ఫ్రాజెన్-2 తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. డిస్ని సంస్థ ప్రతిష్టాత్మకంగా దీనిని తెరకెక్కించింది. ఈ మూవీ విడుదలకు ముందే యువతలో బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో బేబీ ఎల్సా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు డబ్బింగ్ చెప్పే గొప్ప అవకాశం లభించింది. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు నటి నిత్యామీనన్ డబ్బింగ్ చెపుతున్న సంగతి తెలిసిందే.

2013 లో విడుదలైన ఫ్రాజెన్ కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డులకెక్కింది. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ఈ ఫ్రాజెన్. ఈ మూవీ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ మూవీగా అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ ఫ్రాజెన్-2 నవంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు బాషలలో విడుదల కాబోతుంది.