నటుడు శివాజీకి సినిమా ఆఫర్స్ తగ్గిన తరువాత ఒక ప్రముఖ మీడియా అధినేత అడ్డుపెట్టుకొని అప్పట్లో ఏదో ఒక ఇష్యూ మీద హడావిడి చేసేవాడు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిపోయి భజన చేయడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఐటి దాడులపై శివాజీ స్పందిస్తూ నేను ముందుగానే చెప్పినట్లు చంద్రబాబుపై కేంద్రం కుట్ర చేస్తుందని, చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పు ఉందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, చంద్రబాబుపై కోపం ఉంటె ఎన్ కౌంటర్ చేయండని అంతేకాని రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర చేయవద్దని శివాజీ తెలియచేసాడు.

దేశం మొత్తం ఏదొక సమయంలో బడా బాబుల మీద ఐటి దాడులు జరగటం సర్వసాధారణం. అలాగే గత నెలలో ఖమ్మం టిఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థలపై కూడా ఐటి శాఖ ఏకకాలంలో దాడులు చేసాయి. అదే విధంగా ఇప్పుడు విజయవాడ, విశాఖ కేంద్రంగా పన్నులెగొట్టిన మరియు అనుమానమున్న బడా బాబుల మీద ఐటి శాఖ దాడులు చేస్తుంది. ఒకవేళ వారి సోదాలలో ఎలాంటి తప్పుడు పత్రాలు దొరకకపోతే అది ఐటి శాఖకే సిగ్గు చేటు. ఏమైనా తప్పులు చేసి, పన్నులు ఎగొట్టి అక్రమంగా డబ్బులు సంపాదించి ఉంటె వారిపై చర్యలు తీసుకుంటారు.

ఈ ఐటి దాడులకు చంద్రబాబుకి ఎందుకు శివాజీ లింక్ పెడుతున్నదో అర్ధం కావడం లేదు. పారిశ్రామిక వేత్తలందరి మీద ఏమి ఐటి దాడులు చేయడం లేదు కదా? అనుమానం వచ్చిన ఒకరిద్దరి మీదనే ఐటి దాడులు చేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, తనకు తాను మేధావిగా ఊహించుకొనే శివాజీ కూడా గగ్గోలు పెడుతూనే తెలుగు దేశం నాయకుల బొక్కలు అన్ని బయటకు వచ్చేలా ప్రజలకు అనుమానం వస్తుంది. శివాజీ లాంటి చిన్న చితక నటులు చంద్రబాబు కోసం తన నోరుని పెద్దది చేసుకొని రంకెలేసినా ఐటి అధికారులు చేయవలసిన కార్యక్రమం చేసి నివేదిక సమర్పిస్తారు. గత సంవత్సరం తెలుగుదేశం ఎమ్మెల్యే సత్యప్రభ కంపెనీలపై ఐటి అధికారులు దాడి చేస్తే స్పందించని చంద్రబాబు, విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఐటి దాడులపై స్పందిస్తున్నారంటే ఐటి శాఖ దీనిపై గట్టిగానే ఫోకస్ పెట్టి అక్రమార్కులను కలుగులో నుంచి బయటకు లాగి, ప్రజలకు వారు చేస్తున్న అక్రమార్జనను బయటపెట్టాలి.